: విశ్వనాథ్ ను స్వయంగా కలిసి పాత జ్ఞాపకాలు నెమరేసుకున్న చిరంజీవి
కళాతపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్న దర్శకుడు కే విశ్వనాథ్ ను, కాంగ్రెస్ నేత, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తన అభిమాన దర్శకుల్లో ఒకరైన విశ్వనాథ్ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని గెలుచుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లూ ఆనందంగా జీవించాలని కోరుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వంలో తాను నటించిన చిత్రాలకు సంబంధించిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్టు తెలిపారు.