: మూకుమ్మడి దాడి తరువాత బులెట్ ప్రూఫ్ జాకెట్లు, ఏకే 47లు దోచుకెళ్లిన మావోలు... ఎత్తుకెళ్లిన ఆయుధాల వివరాలివి!


జవాన్లపై మూకుమ్మడిగా దాడి చేసి, 26 మందిని బలిగొన్న మావోయిస్టులు, ఇదే అదనుగా భారీ ఎత్తున పోలీసుల ఆయుధాలను దోచుకెళ్లారు. పోలీసులు భోజన విరామ సమయంలో ఉన్న వేళ, సుమారు 300 మంది మావోలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దాడి తరువాత ఏకే-47లు 27, ఏకేఎం గన్స్ 4, ఇన్ సాస్ రైఫిళ్లు 2, ఇన్ సాస్ ఎంఎంజీలు 3, బులెట్ ప్రూఫ్ జాకెట్లు 22, ఏకే 47 మ్యాగజైన్లు 59, ఏకే మ్యాగజైన్లు 16, ఎల్ఎంజీ మ్యాగజైన్లు 16, ఇన్ సాస్ రైఫిల్ మ్యాగజైన్లు 15, ఏకే 47 తుపాకులకు చెందిన 2,820 రౌండ్ల బులెట్లు, ఇన్ సాస్ రైఫిల్స్ కు చెందిన 600 రౌండ్ల బులెట్లను మావోలు ఎత్తుకెళ్లారని పోలీసు అధికారులు ధ్రువీకరించారు.

కాగా, ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రా సరిహద్దుల్లో మావోల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కూంబింగ్ లో కోబ్రా, సీఆర్పీఎఫ్ దళాలు పాల్గొంటున్నాయి. డోర్నపాల్ లో జరిగిన ఘటనలపై కేంద్రం నివేదిక కోరింది. ఈ సాయంత్రంలోగా కేంద్రానికి నివేదిక సమర్పించనున్నట్టు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News