: బాలీవుడ్ భామ సాగరికతో క్రికెటర్ జహీర్ నిశ్చితార్థం


మొత్తానికి 38 ఏళ్ల జహీర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బాలీవుడ్ భామ సాగరిక ఘటెతో గతకొంతకాలంగా సాగుతున్న ప్రేమ వ్యవహారం పెళ్లి వైపు నడుస్తోంది. ఆమెతో తనకు నిశ్చితార్థమైనట్టు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన జహీర్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘‘మీ భార్య ఎంపికలను చూసి నవ్వుకోకండి. ఎందుకంటే మీరు కూడా అందులో భాగమేనన్న సంగతి గుర్తుపెట్టుకోండి’’ అంటూ సాగరికతో ఉన్న ఫొటోతో ట్వీట్ చేసిన జహీర్ ‘నిశ్చితార్థం ముగిసింది’ అన్న హ్యాష్‌టాగ్ తగిలించాడు. జహీర్ పోస్ట్ చేసిన ఫొటోలో సాగరిక వేలికి ఉన్న నిశ్చితార్థ ఉంగరం స్పష్టంగా కనబడుతోంది.

  • Loading...

More Telugu News