: అలా ప్రశ్నిస్తే.. ఏం సమాధానం చెబుతాం?: సానియా
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు విమాన ప్రయాణికుడి నుంచి ఓ వింత అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇంతకీ, ఏంటా వింత అనుభవం అంటే.. ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానంలో ఈ రోజు సాయంత్రం సానియా ప్రయాణించింది. ఆమె పక్క సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి సానియాను చూసి .. ‘మీరు హైదరాబాద్ వెళ్తున్నారా?’ అని ప్రశ్నించారు. దీంతో, సానియాకు నోట మాట రాలేదు. ఎందుకంటే, హైదరాబాద్ వెళ్లే విమానంలో ఎక్కి హైదరాబాద్ వెళ్తున్నారా? అని ఆ వ్యక్తి అడగటమే కారణం. ఈ విషయాన్ని సానియా తన ట్వీట్ లో పేర్కొంది. అలా ప్రశ్నించే వారికి, ఏం సమాధానం చెబుతామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.