: మావోయిస్టుల కాల్పుల్లో 24కు పెరిగిన జవాన్ల మృతి సంఖ్య
చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో ఈ రోజు మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై వారు కాల్పులు జరపడంతో మృతి చెందిన జవాన్ల సంఖ్య 24కి చేరింది. ఆయుధాలతో దూసుకొచ్చిన సుమారు 300 మంది మావోయిస్టులు తమపై దాడి చేశారని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఆర్పీఎఫ్ జవాను మహ్మద్ తెలిపారు. దాడి చేసిన అనంతరం మావోలు జవాన్ల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు లూటీ చేశారు. ఈ ఘటనపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.