: ‘యాపిల్ డేస్’... ఫ్లిప్‌కార్ట్‌లో మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్లు!
యాపిల్ ఐ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే, మీకు ఇదే సువర్ణావకాశం. దేశీయ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘యాపిల్ డేస్’ పేరుతో యాపిల్ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తులపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ లో నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు యాపిల్ ఐఫోన్6 ధరపై దాదాపు రూ.26,000 తగ్గించి అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్7 ను సుమారు రూ.20,000 తగ్గింపుతో అందిస్తోంది. ఇక యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ మోడల్‌పై రూ.6000, 5ఎస్ మోడల్‌పై రూ.2501 తగ్గిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు, యాపిల్‌కు సంబంధించిన ఇతర ఉత్పత్తులపైన కూడా ఇటువంటి బంపర్ ఆఫర్లను ప్రకటించింది. మిగతా వివరాలకు ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ చూడొచ్చు.