: అందుకే, ఇసుక మాఫియా నేతల గురించి చంద్రబాబు పట్టించుకోవట్లేదు: వైఎస్సార్సీపీ నేతలు
ఇసుక మాఫియా నేతలందరూ టీడీపీకి చెందిన వారేనని, అందుకే, సీఎం చంద్రబాబునాయుడు పట్టించుకోవట్లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, డాక్టరు సునీల్ ఆరోపించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ధనుంజయనాయుడు, చిరంజీవులు నాయుడుపై విచారణ జరిపించాలని, ఇసుక దందాలో సంపాదించిన సొమ్మును రికవరీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీకి తొత్తులా మారారని, ఆయన నిర్లక్ష్యం వల్లే చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటన జరిగిందని ఆరోపించారు.