: ఉగ్రదాడి... ప్రాణాలు కోల్పోయిన పీడీపీ నేత అబ్దుల్ ఘని
జమ్ముకశ్మీర్లోని పీడీపీ పుల్వామా జిల్లా ప్రెసిడెంట్ అబ్దుల్ ఘని దర్ పై ఈ రోజు ఉగ్రవాదులు దాడి జరిపారు. ఒక్కసారిగా ఆయనపై కాల్పులతో విరుచుకుపడడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. భద్రతా బలగాలు ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. అయితే, ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అబ్దుల్ ఘని కారులో శ్రీనగర్ వెళ్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారని అధికారులు వివరించారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో వేర్పాటు వాదుల ప్రోత్సాహంతో మరోసారి అల్లర్లు చెలరేగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.