: రాజకీయాలంటే ఆసక్తి లేదు... నా దృష్టి మొత్తం వ్యాపారం పైనే!: నారా బ్రాహ్మణి


రాజకీయాలపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని ఏపీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి అన్నారు. తన ప్రస్తుత లక్ష్యం హెరిటేజ్ గ్రూపును మరింత అభివృద్ధి చేయడమే అని చెప్పారు. 2022 నాటికి హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని రూ. 6 వేల కోట్లకు పెంచడమే తన లక్ష్యమని తెలిపారు. హెరిటేజ్ ఫుడ్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో బ్రాహ్మణి వ్యవహరిస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాదులోని తాజ్ డెక్కన్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో బ్రాహ్మణి మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. 

  • Loading...

More Telugu News