: కశ్మీర్లో రెచ్చగొట్టేందుకు 300 వాట్సప్ గ్రూపులు.. ప్రతి గ్రూపులో 250 మంది
జమ్ముకశ్మీర్‌లోని యువతను రెచ్చిగొట్టి దాడులు చేయించేందుకు సోషల్ మీడియాను యథేచ్చగా వాడుకుంటున్నారు వేర్పాటు వాదులు. అక్కడ మోహరిస్తోన్న బలగాలపైకి రాళ్లు విసురుతున్న ఆందోళనకారులు సుమారు 300 వాట్సప్ గ్రూపుల ద్వారా తమను తాము నియంత్రించుకుంటున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సెక్యూరిటీ ఫోర్సెస్ అందులో ఇప్పటికే 90 శాతం వరకు వాట్సాప్ గ్రూపులు బ్లాక్ చేశారు. ప్రతి వాట్సప్ గ్రూపులో 250 మంది ఉన్నారు. వారంతా తమ ప్రాంతంలోని భద్రతా బలగాల కదలికల గురించి వాట్సప్ గ్రూపుల ద్వారా అందరికీ సమాచారం అందిస్తున్నారు. ఆ గ్రూపుల్లో ఉన్న చాలామందిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నామని అక్కడి అధికారులు చెప్పారు.