: ఫేస్ బుక్ లైవ్ లో సంచలన విషయాలు చెప్పి కలకలం రేపిన మిస్ వరల్డ్ ఫైనలిస్ట్!


మిస్ వరల్డ్ ఫైనలిస్ట్, ఆస్ట్రేలియా నల్ల కలువ అడావు మార్న్ యాంగ్ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేసింది. తన టీనేజ్ వయసులో అత్యాచారానికి గురయ్యానని తెలిపింది. దాదాపు గంటపాటు తన అభిమానులతో మాట్లాడుతూ తానెదుర్కొన్న భయానక ఘటనల గురించి పూస గుచ్చినట్టు చెప్పగా, ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అడిలైడ్ లో తనకు తెలిసిన వ్యక్తే లైంగికంగా వేధించాడని, అప్పుడు ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయానని చెప్పింది. లైవ్ లో కన్నీరు పెడుతూ, ఆ ఘటనలను గుర్తు చేసుకుని ఇప్పుడు బహిరంగంగా మాట్లాడటానికి తానేమీ భయపడటం లేదని చెప్పింది. సౌత్ సూడాన్ లో పుట్టి, ఆస్ట్రేలియాలో పెరిగిన ఈ 22 ఏళ్ల బ్యూటీ క్వీన్, ఇకపై అమ్మాయిల రక్షణకు తనవంతు పాత్రను పోషిస్తానని తెలిపింది.

  • Loading...

More Telugu News