: ప్రధాని మోదీతో భేటీ అయిన కేసీఆర్.. పలు అంశాలపై చర్చ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ ఇప్పుడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. 11.45 గంటలకు ప్రధాని అపాయింట్ మెంట్ నిన్ననే ఖరారయింది. ఈ నేపథ్యంలో 7 రేస్ కోర్సు రోడ్ లోని ప్రధాని నివాసానికి కేసీఆర్ వెళ్లారు. భేటీ సందర్భంగా వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా బీసీ-ఈ రిజర్వేషన్ల పెంపు, వ్యవసాయానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తింపు, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, వెనకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైకోర్టు విభజన తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.