: హైటెక్ సెక్స్ రాకెట్ నడుపుతున్న పోలీసు... కర్ణాటకలో అరెస్ట్
చేస్తున్నది పోలీసు ఉద్యోగం. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నడిపించేది మాత్రం హైటెక్ సెక్స్ రాకెట్. ఆన్ లైన్ మార్గంలో విటులను ఆకర్షించడం, పూర్తి నగదు రహిత లావాదేవీలు, స్టార్ హోటళ్లలో సకల సౌకర్యాలు... బెంగళూరు పరప్పన అగ్రహార పోలీసు స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కరిబసప్ప చేసే నిర్వాకమిది. ఇద్దరు వ్యక్తులతో డీల్ కుదుర్చుకుని, ఆపై వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటూ వారికి సహకరిస్తున్న కరిబసప్పను అరెస్ట్ చేసిన పోలీసులు, అతను పనిచేసే స్టేషన్ పరిధిలోనే ఉన్న పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.
మైకో లేఔట్ లోని ఓ ఇండిపెండెంట్ హౌస్ లో వ్యభిచారం జరుగుతోందని విశ్వసనీయ సమాచారాన్ని అందుకున్న పోలీసులు దాడి జరుపగా, సెక్స్ రాకెట్ వెనుక కరిబసప్ప హస్తం బయపడింది. ఈ వేశ్యా గృహంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ముగ్గురు యువతులతో పాటు స్వైపింగ్ మెషీన్లు, భారీ ఎత్తున నగదు లభ్యమయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ కరిబసప్పను విధుల నుంచి డిస్మిస్ చేయనున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.