: నేడు ఈపీఎస్, ఓపీఎస్ మధ్య తొలి ముఖాముఖి!


తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న ఒ.పన్నీర్ సెల్వం, ఈ. పళనిస్వామిలు విలీనం దిశగా నేడు తొలిసారిగా ముఖాముఖి చర్చలను ప్రారంభించనున్నారు. చర్చల కోసం మూడు రోజుల క్రితం తమ తమ నేతలతో కమిటీలను ఏర్పాటు చేసిన ఇద్దరూ నేటి నుంచి వారితో కలసి స్వయంగా చర్చల్లో పాల్గొంటారని తెలుస్తోంది. శశికళ కుటుంబాన్ని పూర్తిగా దూరం పెట్టేందుకు పళనిస్వామి పెద్దగా అభ్యంతరం పెట్టకున్నా, ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇది చర్చల్లో కొంత ప్రతిష్ఠంభనకు దారితీసే అవకాశాలను కల్పిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఇక పళనిస్వామి వర్గం నుంచి రాజ్యసభ సభ్యుడు ఆర్.వైతిలింగం, పన్నీర్ సెల్వం వర్గం నుంచి మాజీ మంత్రి కేపీ మునుస్వామిలతో కూడిన ఏడుగురు సభ్యుల కమిటీ మూడు రోజుల పాటు చర్చించినా, విలీనం దిశగా తుది అడుగు పడలేదన్న సంగతి తెలిసిందే. జయలలిత మరణంపై సీబీఐ దర్యాఫ్తునకు ఆదేశించాలన్న పన్నీర్ వర్గం డిమాండుకు పళనిస్వామి అంగీకరించలేదు. ఇక ఇద్దరు నేతల చర్చలతో సమస్య ఓ కొలిక్కి వస్తుందని అంచనా.

  • Loading...

More Telugu News