: మెట్టుదిగిన అమెరికా... చర్చలకు రావాలని ఉత్తరకొరియాకు ఆహ్వానం
దక్షిణ కొరియాకు సమీపంలో యుద్ధ నౌకలను మోహరించి, పరిస్థితిని ఉద్రిక్తం చేసిన అమెరికా, ఓ మెట్టు దిగింది. చర్చలకు రావాలని ఉత్తర కొరియాను కోరింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని, ఉద్రిక్త పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించాలని, ఇందుకోసం చర్చిద్దామని కోరుతూ పెంటగాన్ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్నేషనల్ ఒప్పందాలను దృష్టిలో ఉంచుకుని, చర్చల ద్వారా సానుకూలత సాధించేందుకు ఉత్తర కొరియా ముందుకు రావాలని, అస్థిరతను పెంచే యత్నాలు కూడదని హితవు పలికింది. చట్ట విరుద్ధంగా క్షిపణులను పరీక్షించడం తమ దేశ భద్రతకు బెదిరింపుగా భావిస్తున్నామని, ఈ విషయంలో మరిన్ని అడుగులు ముందుకు వేయవద్దని సూచించింది. కాగా, తమ తీరానికి సమీపంలో ఉన్న అమెరికా యుద్ధ నౌకను ఒక్క బాంబుతో ముంచేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించిన మర్నాడే అమెరికా ఇలా స్పందించడం గమనార్హం.