: వైసీపీలోకి ఆనం వివేకా... చర్చలు జరుపుతున్న భూమన!


నెల్లూరు జిల్లా ఫైర్ బ్రాండ్ ఆనం వివేకానందరెడ్డి, వైకాపాలో చేరనున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం వివేకాను ఆకర్షించేందుకు వైకాపాకు చెందిన కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. నెల్లూరులో మరింత బలపడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న వైకాపా ఎత్తుగడల్లో భాగంగా, రెండు రోజుల క్రితం భూమన స్వయంగా ఫోన్ చేసి ఆనం వివేకాతో మాట్లాడినట్టు తెలుస్తోంది.

వైసీపీలో చేరితే, అందరమూ కలసి పని చేసుకోవచ్చని ఆయన ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇక టీడీపీలో చేరి 15 నెలలైనా, ఇంతవరకూ ఎటువంటి పదవులు దక్కకపోవడం, తెలుగుదేశం నేతలతో పడక, ఇమడలేక పోతున్నట్టు ఇప్పటికే పలుమార్లు చెప్పిన ఆయన, త్వరలోనే వైకాపా కండువా కప్పుకోవచ్చని భావిస్తున్నారు. ఈ విషయంలో అటు ఆనం సోదరుల నుంచిగానీ, ఇటు వైకాపా నుంచిగానీ ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

  • Loading...

More Telugu News