: 'బాహుబలి-2' కోసం తిరుమలలో నిర్మాత


మరో నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వెండితెరను తాకనున్న "బాహుబలి: ది కన్ క్లూజన్" చిత్రం విజయవంతం కావాలని కోరుతూ చిత్ర నిర్మాత యార్లగడ్డ శోభు ఈ ఉదయం తిరుమల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. టీటీడీ బోర్డు సభ్యుడు, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుతో కలసి ఆయన రాగా, స్వాగతం పలికిన అధికారులు, వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలను అందించారు. కాగా, ఈ ఉదయం మంత్రి సుజయకృష్ణ రంగారావు, ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తదితరులు స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖుల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News