: ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది: గుంటూరు జిల్లా కలెక్టర్


ఒక కుటుంబానికి ఒకే పెన్షన్ అనే నిబంధన సరికాదని, దీంతో, అణగారిన వర్గాలకు ఇబ్బందికరంగా మారిందని, ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సంచలన వ్యాఖ్యలు చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా గుంటూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. ఈ

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంతిలాల్ దండే విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు పూర్తిగా అందడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News