: మోహన్ లాల్ కు క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ నటుడు కేఆర్కే
వెయ్యికోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్న ‘ది మహాభారత్’ చిత్రంలో భీముడి పాత్ర పోషించనున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను తప్పు చేశానని, క్షమించాలని కేఆర్కే మళ్లీ ట్వీట్ చేశాడు. ‘సార్, మిమ్మల్ని ‘చోటా భీమ్’ అన్నందుకు క్షమించమని అడుగుతున్నా. మీ గురించి నాకు పెద్దగా తెలియదు. మలయాళ సినిమాల్లో మీరు సూపర్ స్టార్ అని ఇప్పుడు తెలుసుకున్నాను’ అని కేఆర్కే పేర్కొన్నాడు. కాగా, మోహన్ లాల్ చోటాబీమ్ గా పనికొస్తారు తప్పా, భీముడి పాత్రకు పనికి రారని, ‘ది మహాభారత్’ చిత్ర నిర్మాత బిఆర్ షెట్టి డబ్బును వృథా చేయవద్దని మోహన్ లాల్ కు సూచిస్తున్నానంటూ కేఆర్కే నాడు తన ట్వీట్ లో విమర్శలు గుప్పించాడు.