: నా పాలనలో 100వ రోజున పెద్ద ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్


యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన వందరోజుల పాలనను త్వరలో పూర్తి చేయనున్నారు. ఈ నెల 29 వ తేదీకి ట్రంప్ వంద రోజుల పాలన పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. ఆ రోజున పెన్సిల్వేనియాలో పెద్ద ర్యాలీ చేపడతానని పేర్కొన్నారు. కాగా, అదే రోజున వైట్ హౌస్ లో కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ నిర్వహించనున్నారు. వైట్ హౌస్ లో వార్తలు కవర్ చేసే మీడియా వర్గాల అసోసియేషన్ ఇది. ఈ అసోసియేషన్ ప్రతి ఏటా వైట్ హౌస్ లో విందు ఏర్పాటు చేస్తుంది. పలు దేశాధ్యక్షులు ఈ విందుకు హాజరుకానున్నారు. అయితే, ఈ విందుకు ట్రంప్ హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని ట్రంప్ ముందుగానే ప్రకటించారు. తన విషయంలో మీడియా కవరేజ్ పై అసంతృప్తిగా ఉన్నానని, అందుకే, ఈ విందుకు తాను హాజరు కావట్లేదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. 

  • Loading...

More Telugu News