: వైఎస్సార్సీపీ శవ రాజకీయాలు మానుకోవాలి: మంత్రి అమర్ నాథ్ రెడ్డి
చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనపై వైఎస్సార్సీపీ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి అమర్ నాథ్ రెడ్డి హితవు పలికారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, చెక్ పోస్టుల వద్ద నియంత్రణ పెంచాలని, ఇసుక మాఫియాకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని, అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అమర్ నాథ్ రెడ్డి హెచ్చరించారు.