: వైఎస్సార్సీపీ కార్యకర్తల అత్యుత్సాహం..ఏర్పేడు గ్రామస్థుల ఆగ్రహం!
చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన లారీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ రోజు పరామర్శించారు. ఈ సందర్భంగా మునగలపాలెంలో జగన్ పర్యటించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే, జగన్ పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు. జగన్ గ్రామంలోకి వస్తున్న సమయంలో ‘జై జగన్’ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. దీంతో, గ్రామస్థులు మండిపడ్డారు. ‘మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చారా? లేక వైఎస్సార్సీపీ మీటింగ్ కు వచ్చారా? మీ పరామర్శలు మా కొద్దు .. వెళ్లిపోండి’ అని గ్రామస్థులు మండిపడటంతో.. వైఎస్సార్సీపీ నేతలు క్షమాపణలు చెప్సాల్సి వచ్చింది.