: క్షమాపణలు చెప్పిన కట్టప్పకు కమల్ అభినందనలు
కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పిన కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కు ప్రముఖ నటుడు కమలహాసన్ మద్దతుగా నిలిచారు. సమస్యాత్మక వాతావరణంలో హేతుబద్ధతని కాపాడిన సత్యరాజ్ కి తన అభినందనలు తెలియజేస్తున్నానని కమల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కమల్ తన సినిమా ‘విరుమాంది’లోని తమిళ డైలాగ్ ను ప్రస్తావించారు. ‘క్షమాపణలు కోరినవాడే గొప్ప మానవుడు’ అని ఆ డైలాగ్ అర్థం.
కాగా, ఈ నెల 28న బాహుబలి-2 చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే, తొమ్మిదేళ్ల క్రితం కావేరి జల వివాదంపై సత్యరాజ్ మాట్లాడిన మాటలను కన్నడ సంఘాలు మళ్లీ తెరపైకి తీసుకురావడమే కాకుండా, ‘బాహుబలి-2’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డకుంటామని హెచ్చరించడం తెలిసిందే. కన్నడ సంఘాలను శాంతి పరిచే నిమిత్తం ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. అయినా..కన్నడ సంఘాలు వెనక్కి తగ్గలేదు. దీంతో, సత్యరాజ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.