: ఎప్పుడూ తుపాకులు పట్టుకునే ఉండాలా?.. పవన్ కల్యాణ్ నాకు చిరకాల మిత్రుడు: గద్దర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు చిరకాల మిత్రుడని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ పేరు బాగా వినిపిస్తోందని అన్నారు. తన సొంత పార్టీ గురించి తొలుత ఆలోచిస్తానని... ఆ తర్వాతనే పవన్ తో కలసి పనిచేసే అంశం గురించి ఆలోచిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి రావడంలో తప్పులేదని... ఎప్పడూ తుపాకీ పట్టుకునే ఉండాలా? అని గద్దర్ ప్రశ్నించారు. రాజ్యాధికారం అన్నింటికన్నా ముఖ్యమని... ఓటు ఎన్నటికీ ఆయుధమే అని చెప్పారు. ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ను తరలించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం యత్నిస్తుండటం సరైనది కాదని... ప్రభుత్వం ఇలాగే ముందుకు సాగితే ప్రతి ఇంటిని ఒక ధర్నా చౌక్ చేయాలని పిలుపునిచ్చారు.