: కేసీఆర్ కుటుంబంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రవాళ్ల మోచేతి నీళ్లు తాగేవారు తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే... అది కేసీఆర్ కుటుంబమే అని అన్నారు. అధికారిక కార్యక్రమాల్లో సైతం కేసీఆర్ మనవడు కనిపిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. పదేళ్ల తర్వాత కేటీఆర్ కాదు... ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయ్యేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఈ రోజు సేవ్ ధర్నా చౌక్ పేరుతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.