: ఏర్పేడు బాధితులను పరామర్శించిన జగన్
చిత్తూరు జిల్లా ఏర్పేడులో చోటు చేసుకున్న లారీ ప్రమాద ఘటనలో చనిపోయిన వారి కుటుంబసభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ ఉదయం హైదరాబాదు నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న జగన్ అక్కడ నుంచి మునగాలపాలెంకు వెళ్లారు. అక్కడ 13 మంది మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ముసిలిపేడు, రావిళ్లవారిపల్లె ప్రాంతాలకు వెళతారు. మార్గ మధ్యంలో స్వర్ణముఖి నదిలో ఇసుక గుంతలను ఆయన పరిశీలిస్తారు. ఏర్పేడు మండల కేంద్రంలో జరిగిన లారీ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 15 మందికి పైగా గాయపడ్డారు.