: 10 రూపాయల కాయిన్లు చెల్లవు... పెట్రోల్ బంకుల ఎదుట బోర్డులు
హైదరాబాద్ వాసులను మరో కొత్త సమస్య పీడిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న కరెన్సీ కష్టాల నుంచి జనాలు ఇంకా కోలుకోక ముందే మరో సమస్య వచ్చి పడింది. రూ. 10 కాయిన్లు చెల్లవంటూ నగరంలోని కొన్ని పెట్రోలు బంకులు బోర్డులు పెట్టాయి. పది రూపాయల కాయిన్లను రద్దు చేయలేదని ఆర్బీఐ స్వయంగా ప్రకటించినప్పటికీ... కాయిన్లు చలామణిలో లేవంటూ బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో, కొన్ని పెట్రోలు బంకులు ఈ కాయిన్లను తీసుకోవడం మానేశాయి. దీంతో, వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.