: అత్యంత దారుణం.. అల్లూరి సీతారామరాజు చేతిలో బీర్ బాటిల్
బ్రిటీష్ వారి గుండెల్లో దడ పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. గుర్తు తెలియని దుండగులు అల్లూరి చేతిలో బీర్ బాటిల్ పెట్టడం సంచలనం రేపుతోంది. విశాఖపట్నం జిల్లా మాకవరపాలెంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ అల్లూరి విగ్రహం ఉంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విగ్రహాల వద్ద నిఘా ఉంచాలని అంటున్నారు.