: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ఎనిమిదేళ్ల పసివాడికి గుండె మార్పిడి శస్త్రచికిత్స.. విజ‌య‌వంతం


హైదరాబాదులో తొలిసారిగా ఎనిమిదేళ్ల పసివాడికి గుండె మార్పిడి శస్త్రచికిత్స జ‌రిగింది. ఈ గుండె మార్పిడి ఆప‌రేష‌న్‌ విజయవంతంగా పూర్తయింద‌ని హైద‌రాబాద్ న‌గ‌రంలోని స్టార్ హాస్పిటల్స్ వైద్యులు మీడియాకు తెలిపారు. హృద్రోగంతో బాధ‌ప‌డుతున్న‌ యశ్వంత్ అనే బాలుడికి బంజారాహిల్స్‌లోని తమ ఆస్పత్రిలో ఈ చికిత్స చేసినట్లు చెప్పారు. ఆ బాలుడి గుండె మార్పిడి ఆప‌రేష‌న్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారుతో పాటు కార్వి కంప్యూటర్స్ యాజమాన్యం ఆర్థిక సాయం అందించిందని తెలిపారు. శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న బాలుడిని వైద్యులు మీడియా ముందు ఉంచి, ఆప‌రేష‌న్ జ‌రిపిన తీరుని వివ‌రించారు.

  • Loading...

More Telugu News