: అద్భుతంగా రాణించిన ధోనీ... సన్ రైజర్స్ హైదరాబాద్ పై పూణె విజయం
ఐపీఎల్-10లో భాగంగా ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, పూణె జట్ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 177 పరుగుల విజయ లక్ష్యాన్ని పూణె ముందు ఉంచింది. చివరి వరకు నువ్వా? నేనా? అనే విధంగా జరిగిన ఈ మ్యాచులో హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో పూణె విజయం సాధించింది. 34 బంతుల్లో 61 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ పూణెను విజయతీరానికి చేర్చాడు.