: 2019 ఎన్నికల్లో నా రాజకీయ ప్రవేశం: సినీనటుడు సుమన్
సినీనటుడు సుమన్ తన రాజకీయ రంగప్రవేశంపై ఈ రోజు ఓ ప్రకటన చేశారు. ఈ రోజు ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో తన రాజకీయ ప్రవేశం ఉంటుందని చెప్పారు. తాను ఏపార్టీ వైపు వెళ్తానో చెప్పలేనని ఆయన అన్నారు. అయితే, ప్రజల సమస్యలను తీర్చే పార్టీకి తాను మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తానని, లేదంటే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని అన్నారు. కాగా, దక్షిణ భారత్ నుంచి ఒక వ్యక్తికి కచ్చితంగా ఉప ప్రధాని పదవి ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.