: ప్రయాణికులతో పాటు క్యూలో నిల్చున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు
విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ రోజు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో క్యూలో నిలబడి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఈ రోజు సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆయన... అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులతో పాటు క్యూలో నిల్చున్నారు. ఈ అంశంపై ఆయన పీఆర్వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. అశోక్ గజపతిరాజు అన్ని అంశాల్లో ఆదర్శంగా నిలుస్తారని తెలపడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆయన ఎల్లప్పుడు సాధారణ వ్యక్తిలాగే ఉంటారని అన్నారు.