: ‘బాహుబలి-2’ రోజుకి ఆరు షోలు.. ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!
దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమాను ఆరు షోలు ప్రదర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుంచి ఆ సినిమా యూనిట్‌కి అనుమతి లభించింది. ఈ నెల 28 నుంచి పది రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆరు షోలు ప్రదర్శించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో బాహుబలి టీం, అభిమానులు ఎంతో ఖుషీగా ఉన్నారు. మరోవైపు ఈ రోజు విడుదలైన బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో ఆ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.