: మహిళను కొట్టి విమానం నుంచి దింపేసిన సిబ్బంది!


విమానయాన సంస్థ‌ల సిబ్బంది ప్ర‌యాణికుల ప‌ట్ల ప్ర‌వ‌ర్తిస్తోన్న తీరు ఆ కంపెనీల‌కే చెడ్డ‌పేరు తెచ్చిపెడుతోంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో తాజాగా ఓ సిబ్బంది ప్ర‌యాణికురాలితో ప్ర‌వ‌ర్తించిన తీరు అంద‌రికీ ఆగ్ర‌హం తెప్పిస్తోంది. నిన్న‌ రాత్రి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి విమానం ఎక్కింది. అయితే, త‌న చిన్న పాప‌ను ఆమె స్ట్రోలర్‌లో కూర్చోపెట్టుకుంది. దీంతో ఫ్లైట్‌ అటెండెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆమెతో దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. ఆమెపై చేయిచేసుకోవ‌డ‌మే కాకుండా ఆమె తరఫున మాట్లాడిన మరో ప్రయాణికుడిని కూడా కొట్టాడు.

త‌ర్వాత ఆ మహిళని, పిల్లల్ని విమానం నుంచి దించేశాడు. ఆ దృశ్యాల‌ను ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై స్పందించిన‌ ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పి, మ‌హిళ‌తో అలా ప్ర‌వ‌ర్తించిన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొల‌గించింది. స‌ద‌రు ప్ర‌యాణికు‌రాలికి ఫస్ట్‌క్లాస్‌లో సీట్‌ కేటాయించింది.

  • Loading...

More Telugu News