: ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన దినకరన్
తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే శశికళ వర్గం తరఫున బరిలో నిలిచిన ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ రెండాకుల గుర్తుకోసం ఎన్నికల అధికారికి రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని పోలీసులు జారీ చేసిన సమన్ల నేపథ్యంలో ఆయన ఈ రోజు చెన్నై నుంచి బయలుదేరి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మధ్యవర్తి సుఖేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయనను పోలీసులు పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరే ముందు విమానాశ్రయంలో మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడుతానని ఆయన అన్నారు.