: కేసీఆర్ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకునే స్థితికి చేరారు: రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకునే స్థితికి చేరారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ఆయన సొంత గ్రామస్తులే విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని, రైతాంగాన్ని మభ్యపెట్టేందుకే ఉచిత ఎరువుల పథకం పెట్టారని ఆయన అన్నారు. రైతు రుణమాఫీని వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పిన కేసీఆర్ ఆ హామీని ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు ఎలా రక్షణ కల్పించబోతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 28న తాండూరులో ప్రజాపోరు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.