: ప్రేమ పెళ్లి.. వేధింపులు తాళలేక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య
ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి ఏడాదిన్నర తిరగక ముందే ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలోని రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న యువతిని నిఖిత (21) గా పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి తన భర్త నుంచి ఎదురవుతున్న మానసిక, శారీరక వేధింపులే కారణమని తెలిసింది. ఆ యువతి భవనంపై నుంచి దూకి ఈ ఘటనకు పాల్పడింది.