: ఢిల్లీలో యూరిన్ బాటిళ్లు ముందు పెట్టుకొని రైతుల ఆందోళన
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు కొన్ని రోజులుగా ఢిల్లీలో వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు వారు జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళనను కొనసాగిస్తూ... తమ మూత్రం తామే తాగుతామని యూరిన్ బాటిళ్లు ముందు పెట్టుకుని నిరసన తెలిపారు. రుణమాఫీ, కరవు సాయం చేయాలని తమిళ రైతులు రోజుకో విధంగా నిరసనలు తెలిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి కొత్త ప్రకటన చేయలేదు. కరవు, తుపాను సాయం కింద ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.2వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి విదితమే. కానీ, ఆ సాయం సరిపోదని రైతులు అంటున్నారు.