: వీరూ భాయ్‌, ఆర్తి వదిన.. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు: శిఖర్‌ ధావన్‌, సురేశ్ రైనా


‘వీరూ భయ్యా మీకు, వదినకూ పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు శిఖర్‌ ధావన్ విషెస్ తెలిపాడు. వీరు, ఆర్తిలు జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ రోజు తన 14వ పెళ్లిరోజు జరుపుకొంటున్నాడు. ఈ సంద‌ర్భంగా సెహ్వాగ్‌కి ప‌లువురు క్రికెట‌ర్‌లు ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. రిషబ్‌ పంత్ త‌న ట్వీట్ ద్వారా.. పెళ్లి రోజు శుభాకాంక్షలు భయ్యా అని అన్నాడు. ఇక సురేశ్ రైనా.. ‘వీరూ భాయ్‌, ఆర్తి వదిన.. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అన్నాడు.

అంతేకాదు.. వీరూ, ఆర్తి కూడా ఒక‌రికొక‌రు అదే ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు చెప్పుకున్నారు. ఓ అద్భుతమైన వ్యక్తితో తాను 13 ఏళ్లు ఆనందంగా కలిసున్నానని ఆర్తి పేర్కొంది. త‌న‌ జీవితంలో ప్రేమ, సంతోషం నింపినందుకు వీరూకి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు, భవిష్యత్‌లోనూ మనకి ఇలాంటి మంచి రోజులే కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ ట్వీట్‌కి సెహ్వాగ్‌ రిప్లై ఇచ్చాడు. వివాహ వార్షికోత్సవం అనేది జ్ఞాపకంగా చేసుకునే ఓ వేడుక అని, కానీ మా పెళ్లి కలకాలం చేసుకునే వేడుకలాంటిదని ఆయ‌న అన్నాడు. త‌న‌కు జీవితంలో అన్నీ ఇచ్చినందుకు ఆర్తికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు  పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News