: యోగి స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేశారు.. ఇక ఎవరినీ సహించం: యూపీ డీజీపీ


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ అత్యంత కీలకమైన మార్పు చేశారు. డీజీపీ జావెద్ అహ్మద్ స్థానంలో సుల్ఖాన్ సింగ్ ను నియమించారు. కొత్త డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన సింగ్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీలతో సంబంధం లేకుండా శాంతిభద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారని చెప్పారు. గూండాగిరిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. అవినీతిని ఎంత మాత్రం సహించమని హెచ్చరించారు. గోరక్షణ, ఇతర పేర్లతో ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

  • Loading...

More Telugu News