: రాజకీయాల్లోకి జగన్ సతీమణి వైఎస్ భారతి?


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి రాజకీయాల్లోకి రానున్నారా? అంటే పరిస్థితులు ఆమెను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చేలా ఉన్నాయని ఒక టీవీ ఛానెల్ పేర్కొంటోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి కుటుంబ సభ్యులంతా రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేసింది. వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో వైఎస్ విజయమ్మ విశాఖపట్టణం నుంచి పోటీ చేసి, పరాజయం పాలుకాగా, రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల వైఎస్సార్సీపీ ప్రచారకర్తగా వ్యవహరించారు. అనంతరం క్రియాశీలక రాజకీయాల్లో ఆమె పెద్దగా కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో రేపు కోర్టు తీర్పు ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా వచ్చినా, పార్టీని నడిపించే బాధ్యతను వైఎస్. భారతి తీసుకునే అవకాశం ఉందని ఆ ఛానెల్ తెలిపింది. కాగా, వైఎస్.భారతి సాక్షి పత్రికను నడిపే బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News