: తిరుపతిలో వివాదం... కేకలేసుకున్న ఎమ్మెల్యే, ఎస్పీ!


తిరుపతిలో ఎస్పీ జయలక్ష్మి, ఎమ్మెల్యే నారాయణ మధ్య వివాదం చోటుచేసుకుంది. ఏర్పేడు ప్రమాద ఘటనలో 20 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారిని పరామర్శిచేందుకు ప్రజాప్రతినిధులు రుయా ఆసుపత్రికి పోటెత్తడంతో అక్కడ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. క్షతగాత్రులకు చికిత్స జరుగుతోందని, మృతులకు పోస్టు మార్టం నిర్వహించాల్సి ఉందని చెబుతూ పరామర్శకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే నారాయణను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఎస్పీ జయలక్ష్మితో వాగ్వాదానికి దిగారు. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించాల్సిన బాధ్యత తమపై ఉందని, తమను అనుమతించాలని ఆయన కోరారు. దానికి ఆమె అభ్యంతరం చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. 

  • Loading...

More Telugu News