: మోదీ టీ అమ్మిన వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ!
చిన్నప్పుడు మోదీ టీ అమ్మిన గుజరాత్‌లోని వాద్‌నగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ స్టేషన్ అభివృద్ధికి రూ.8 కోట్లు కేటాయించినట్టు రైల్వే సహాయ మంత్రి సిన్హా తెలిపారు. పర్యాటక స్థలాల అభివృద్ధి ప్రాజెక్టులో వాద్‌నగర్ భాగమని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా వాద్‌నగర్-మెహ్‌సనా మార్గంలో ప్రస్తుతం ఉన్న మీటర్ గేజ్ మార్గాన్ని బ్రాడ్‌గేజ్‌లోకి మార్చే పనులు ఇప్పటికే మొదలైనట్టు మంత్రి తెలిపారు. వాద్‌నగర్‌తోపాటు సమీపంలోని మోధెరా, పఠాన్ ప్రాంతాలను రూ.100 కోట్లతో పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా, తాను బాల్యంలో వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో తండ్రితో కలిసి టీ విక్రయించేవాడినని మోదీ గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.