: నాగపూర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దారుణం..బాలికపై అత్యాచారం!


మహారాష్ట్రలోని నాగపూర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై అత్యాచారం జరిగిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని రూమ్ నెంబర్ 320లో ఈ అత్యాచారం జరిగింది. తన నగల దుకాణంలో పని చేసే ఓ బాలికకు యజమాని మనోజ్ భగవత్ మాయమాటలు చెప్పి..ఎమ్మెల్యే క్వార్టర్స్ కు తీసుకువెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్టు ఆరోపణలు. ఈ సంఘటనకు సంబంధించి మనోజ్ భగవత్ సహా మరో వ్యక్తి రజత్ మదరేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, పోలీసు బందోబస్తు ఉండే ఎమ్మెల్యే క్వార్టర్స్ లోకి సదరు షాపు యజమాని ఎలా వెళ్లాడనే విషయమై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన మహిళా నాయకురాలు నీలమ్ గోర్హే డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News