: దిగ్విజయ్ ఎదుట నల్గొండ నేతల బాహాబాహి!


తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎదుటే నల్గొండ జిల్లా నేతలు బాహాబాహీకి దిగారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా భువనగిరి, మునుగోడు నియోజకవర్గాలపై సమీక్ష జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుది. ఈ వ్యవహారం పరస్పరం చేయి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేందుకు సిద్ధపడగా, దిగ్విజయ్ సింగ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News