: భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు: భారత్‌కు చైనా హెచ్చరిక


త‌మ దేశ భూభాగంగా పేర్కొంటూ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఆరు ప్రాంతాల‌కు ఇటీవ‌లే చైనా పేర్లు ప్ర‌క‌టించిన విష‌యం ప‌ట్ల భార‌త్ దీటుగా స్పందించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ అంశంలో మ‌రోసారి త‌మ అక్క‌సును వెళ్ల‌గ‌క్కిన చైనా.. భారత్‌ దలైలామా కార్డును ఉపయోగిస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో పేర్లను ప్రామాణీకరించే చట్టపరమైన హక్కు తమకు ఉందని చైనా పేర్కొంది.

చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి లూ కంగ్ ఈ అంశంపై మాట్లాడుతూ... భారత ఈశాన్య ప్రాంతంలో చైనా సరిహద్దు స్థిరంగా, స్పష్టంగా ఉందని వ్యాఖ్య‌లు చేశారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో టిబెటన్‌ చైనీయులు, మోంగా తెగవారు కొన్ని తరాలుగా నివసిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News