: ఏపీ కేబినెట్ భేటీ.. ఏర్పేడు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు అంశాలపై చర్చిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఓ లారీ బీభత్సం సృష్టించి 20 మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు మంత్రివర్గం ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించింది. ఏర్పేడు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఆరుగురు నేరుగా లారీ ఢీకొనడంతో చనిపోయారని, మిగతా 14 మంది ప్రమాదం వల్ల సంభవించిన విద్యుదాఘాతం, మంటల ధాటికి మృత్యువాత పడ్డారని రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప వివరించారు.