: ప్రముఖ నటుడు కమల హాసన్ కు కోర్టు సమన్లు!
మహాభారత గ్రంథం, ద్రౌపదిపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమలహాసన్ చిక్కుల్లో పడ్డారు. చెన్నైలోని వల్లియూర్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 5న కోర్టు ముందు హాజరుకావాలని ఈ మేరకు ఆదేశించింది. కాగా, మహాభారతంపైన, ద్రౌపదిపైన కమల్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ హిందూ మక్కల్ కట్చి పార్టీ కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలోనే కమల్ కు కోర్టు సమన్లు జారీ చేసింది.