: చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు: భూమన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని, సోషల్ మీడియాను నిషేధించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జరుగుతున్న అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా ఖండిస్తే చంద్రబాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని, భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తోందని భూమన మండిపడ్డారు. చంద్రబాబుకు తగిన రీతిలో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.