: పార్టీ నాయకులు కొందరు చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు


తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు పార్టీకి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకులు తాము బాగుపడితే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో సుజయకృష్ణ రంగారావు సమావేశం నిర్వహిస్తే ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారని, ఇలా చేయడం కరెక్టు కాదని అన్నారు. ఇసుక విషయంలో పార్టీకి, ప్రభుత్వానికి వచ్చిన చెడ్డపేరును తొలగించేందుకు తాను చాలా కష్టపడిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్బంగా ప్రస్తావించారు. 

  • Loading...

More Telugu News